సామెతలు
ఇ
- ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
- ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
- ఇంటికన్నా గుడి పదిలం
- ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
- ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
- ఇంట్లో పిల్లి, వీధిలో పులి
- ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
- ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
- ఇద్దరు ముద్దు, ఆపై వద్దు
- ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
- ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
- ఇల్లలకగానే పండగకాదు
- ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
- ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
- ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
- ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
- ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
- ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
- ఇసుక తక్కెడ, పేడ తక్కెడ
- ఇల్లలకగానే పండగ కాదు
- ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు
ఉ
- ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
- ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
- ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ
- ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
- ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
- ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
- ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
ఊ
- ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
- ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
- ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
- ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట
- ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
- ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
- ఊర్లో పెళ్ళికి ఇంట్లో సందడి
- ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి
- ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
- ఊరికి ఉపకారి ఆలికి అపకారి
ఎ
- ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
- ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
- ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
- ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
- ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
- ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
- ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?
- ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
- ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
- ఎద్దు పుండు కాకికి ముద్దు
- ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
- ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
- ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
- ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
- ఎవడి బ్లాగుకు వాడే సుమన్ అని
ఏ
- ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
- ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
- ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
- ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
- ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
- ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
- ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
- ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
- ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
- ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
- ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
- ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
- ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
- ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
- ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
- ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
- ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య
ఒ
- ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
- ఒక దెబ్బకు రెండు పిట్టలు
- ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే
- ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
- ఒళ్ళు బలిసిన పూజారి అమ్మవారిని పట్టుకున్నాడట
ఓ
- ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
- ఓర్చినమ్మకు తేట నీరు
- ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
- ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి
అం
- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
- అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
- అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
- అంచు డాబే కాని, పంచె డాబు లేదు
- అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
- అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
- అంతంత కోడికి అర్థశేరు మసాలా.
- అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
- అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
- అంతా మనమంచికే.
- అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
- అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
- అందని ద్రాక్ష పుల్లన
- అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
- అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
- అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
- అందితే జుట్టు అందకపోతే కాళ్లు
- అందితే తల, అందకపోతే కాళ్లు
- అంధుడికి అద్దం చూపించినట్లు
- అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు