గ
- గంగిగోవు పాలు గరిటడైన చాలు
- గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
- గంతకు తగ్గ బొంత
- గతి లేనమ్మకు గంజే పానకము
- గాజుల బేరం భోజనానికి సరి
- గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
- గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
- గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
- గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
- గుంపులో గోవిందా
- గుడ్డి కన్నా మెల్ల నయము కదా
- గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
- గుడ్డోడికి కుంటోడి సాయం
- గుడ్డెద్దు చేలో పడినట్లు
- గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
- గురివింద గింజ తన నలుపెరగదంట
- గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
- గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..!
- గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
- గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
- గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
- గూటిలో కప్ప పీకితే రాదు
- గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు
- గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
- గోడకేసిన సున్నం
- గోతి కాడ నక్కలా
- గోరంత ఆలస్యం కొండొంత నష్టం
- గోరుచుట్టు మీద రోకటిపోటు
- గాడిదకు తెలియునా గంధం పొడి వాసన;పంది కేమి తెలియును పన్నిటి వాసన
ఘ
చ
- చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
- చక్కనమ్మ చిక్కినా అందమే
- చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
- చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
- చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
- చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
- చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
- చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
- చనిపోయిన వారి కళ్ళు చారెడు
- చల్లకొచ్చి ముంత దాచినట్లు
- చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
- చాప క్రింది నీరులా
- చారలపాపడికి దూదంటి కుచ్చు
- చారాణా కోడికి భారాణా మసాలా
- చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
- చింత చచ్చినా పులుపు చావనట్టు
- చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
- చిత్తశుద్ది లేని శివపూజలేల
- చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
- చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
- చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
- చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
- చెడపకురా చెడేవు
- చెప్పేవాడికి వినేవాడు లోకువ
- చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
- చెముడా అంటే మొగుడా అన్నట్టు
- చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
- చెవిలో జోరీగ
- చేతకాక మంగళవారమన్నాడంట
- చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
- చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
- చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...
- చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
- చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు
ఛ
జ
- జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
- జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
- జన్మకో శివరాత్రి అన్నట్లు
- జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
- జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
- జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
- జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
- జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
- జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
- జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
- జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు