ఇంటర్నెట్ లో వచ్చిన అద్భుతమైన మార్పుల వల్ల అన్ని సాప్ట్ వేర్ అప్లికేషన్లు మనకు ఉచితంగా లభిస్తున్నాయి.కంప్యూటర్ తెలిసిన ప్రతి సగటు పీసీ యూసర్ కు మైక్రోసాప్ట్ సంస్థ యొక్క "MS-OFFICE"గురించి అందరికి తెలిసే ఉంటుంది.డాక్యుమెంట్లు తయారు చేయాలంటే WORD ప్రోగ్రాము ను స్లయిడ్ ప్రజంటేషన్ కోసం POER POINT డాటా బేస్ అప్లికేషన్ల కోసం EXCEL ,ACCESSల ను ఉపయోగిస్తుంటాం, కాని ms-office సాప్ట్ వేర్ కావాలంటే డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది .అలాటి ఇంటర్ ఫేస్ ను కలిగిన సాప్ట్ వేర్ ఒకటి ఆన్ లైన్ లో ఉచితంగా లభిస్తోంది .మన word అప్లికేషన్ అందులో writer గా, power point అప్లికేషన్ impressగా,డటా బేస్ అప్లికేషన్లు mathమరియు calc గా కనిపిస్తాయి .ఆ అప్లికేషన్openoffice.orgవెబ్ సైట్ లో ఉచితంగా లభిస్తుంది .ఈ సైట్ లోకి వెళ్ళి డౌన్ లోడ్ చేసుకొవచ్చు .
వర్డ్ డాక్యుమెంట్ లాగా అన్ని ఆప్షన్లు ఉండే writer ప్రోగ్రాం.
స్లయిడ్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే impress ప్రోగాం .
mathematical calculations చేసుకోవడానికి ఉపయోగపడే math ప్రోగాం .
MS-OFFICEలో ఉన్న accessడాటా బేస్ ప్రోగ్రాం మాదిరిగా ఈ open officeలో మనకు base అనే ప్రోగ్రాం ఉంది.ఎంతటి డాటా బేస్ ను అయినా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మరి ఈ అప్లికేషన్లను ఒకసారి ట్రై చేయండి!!