ర
- రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
- రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
- రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
- రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు
- రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?
- రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
- రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు
- రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట
- రెక్కాడితే గానీ డొక్కాడదు
- రెంటికీ చెడిన రేవడి చందాన
- రెడ్డొచ్చె మొదలాడు
- రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
- రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
- రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
- రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
- రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
- రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
- రౌతు కొద్ది గుర్రం
ల
వ
- వంగలేక మంగళవారం అన్నాడంట
- వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
- వస్తే కొండ పోతే వెంట్రుక
- వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు
- వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
- విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
- వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
- వీపు విమానం మోత మోగుతుంది
- వేపకాయంత వెర్రి
- వేగం కన్నా ప్ర్రాణం మిన్న
- వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
- వాడికి సిగ్గు నరమే లేదు
- విగ్రహపుష్టి నైవేద్యనష్టి
- వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
- విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
- వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు
- వంకరటింకర పోతుంది పాము కాదు
శ
- శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
- శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
- శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట
- శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
- శతకోటి లింగాలలో బోడిలింగం
- శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
- శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
- శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
- శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు
- శొంఠి లేని కషాయం లేదు
- శ్వాస ఉండేవరకే ఆశ ఉంటుంది
ష
స
- సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
- సంతులేని ఇల్లు చావడి కొట్టం
- సంతోషమే సగం బలం
- సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
- సంపదలో మరపులు ఆపదలో అరుపులు
- సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
- సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది
- సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
- సత్రం భోజనం మఠం నిద్ర
- సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
- సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
- సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
- సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
- సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
- సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
- సింగడు అద్దంకి వెళ్లినట్టు
- సింగినాదం జీలకర్ర
- సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
- సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
- సొమ్మొకడిది సోకొకడిది
- సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
- సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు
హ
- హనుమంతుడి ముందా కుప్పిగంతులు
- హనుమంతుడు... అందగాడు...
- హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు
- హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు