ప
- పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
- పండగ నాడు కూడా పాత మొగుడేనా?
- పండిత పుత్ర పరమ శుంఠ
- పండితపుత్రుడు... కానీ పండితుడే...
- పందికేంతెలుసు పన్నీరు వాసన
- పక్కలో బల్లెం
- పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
- పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
- పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
- పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
- పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
- పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
- పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
- పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
- పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
- పావలా కోడికి ముప్పావలా దిష్టి
- పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
- పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
- పాలు, నీళ్ళలా కలిసిపోయారు
- పిండి కొద్దీ రొట్టె
- పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
- పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
- పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
- పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
- పిచ్చోడి చేతిలో రాయి
- పిచ్చోడికి పింగే లోకం
- పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
- పిల్లికి బిచ్చం పెట్టనివాడు
- పుండుకు పుల్ల మొగుడు
- పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
- పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
- పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
- పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
- పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
- పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
- పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
- పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
- పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
- పెరుగుట విరుగుట కొరకే
- పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
- పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
- పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
- పైన పటారం, లోన లొటారం
- పొట్టోడికి పుట్టెడు బుద్దులు
- పొమ్మనలేక పొగపెట్టినట్లు
- పొయ్యి దగ్గర పోలీసు
- పొరుగింటి పుల్లకూర రుచి
- పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
బ
- బతకలేక బడి పంతులని
- బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
- బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
- బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు
- బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు
- బ్రతికుంటే బలుసాకు తినొచ్చు
- బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
- బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
- బుగ్గ గిల్లి జోల పాడటం
- బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
- బెల్లం చుట్టూ ఈగల్లా
- బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
- బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
మ
- మంగలిని చూసి గాడిద కుంటినట్లు
- మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
- మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
- మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు
- మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
- మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
- మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
- మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
- మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
- మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
- మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
- మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
- మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
- మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
- మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
- మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
- మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
- మింగ లేక మంగళవారం అన్నాడట
- మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
- ముంజేతి కంకణానికి అద్దమేల ?
- మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
- ముందు నుయ్యి వెనుక గొయ్యి
- ముందుంది ముసళ్ళ పండుగ
- ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
- ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
- ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
- ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
- మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
- మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
- మొండివాడు రాజు కన్నా బలవంతుడు
- మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
- మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
- మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
- మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
- మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
- మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
- మొరిగే కుక్క కరవదు
- మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
- మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
- మౌనం అర్ధాంగీకారం
- మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
- ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట